విందులు, దావత్‌లు చేస్తున్నారా..? ఫంక్షన్ నిర్వహకులపై నిఘా

byసూర్య | Sat, Jul 13, 2024, 10:05 PM

తెలంగాణలో పుట్టుకైనా.. చావైనా వేడుకలా నిర్వహిస్తారు. పెద్ద పెద్ద దావత్‌లు పార్టీలు ఏర్పాటు చేస్తారు. ఇక రాష్ట్రంలో ఎంత చిన్న దావత్ అయినా.. మద్యం మమూలే. 'తెలంగాణలో తాగుడు వ్యసనం కాదు.. అలవాటు పడిన ఓ సాంప్రదాయం' అని ఓ తెలుగు సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. దీన్న బట్టే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో మద్యానికి ఎలాంటి ప్రాధాన్యతనిస్తారో. ఇక విషయానికికోస్తే.. రాష్ట్రంలో జరుగుతున్న దావత్‌లు పార్టీలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. దావత్‌లలో మద్యం వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.


 ఎలాంటి ట్యాక్స్ చెల్లించని మద్యం (నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ ) వినియోగంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఫంక్షన్లపై కూడా దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నాయి. నిబంధనల ప్రకారం.. ఫంక్షన్లు, విందు పార్టీల్లో మద్యం వినియోగానికి ముందుగా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి 'ఈవెంట్‌ పర్మిషన్‌' తీసుకోవాలి. అలా పర్మిషన్ తీసుకున్న వారికి మాత్రమే మద్యం అనుమతి ఉంటుంది. అందులోనూ స్టేట్‌కు సంబంధించిన లిక్కర్‌ను మాత్రమే దావత్‌లలో వినియోగించాలి.


కానీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి తీసుకున్న వారిలో కొందరు తక్కువ ధరకు మద్యం వస్తుందని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలనైన యానాం, గోవా వంటి ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా మద్యాన్ని తీసుకొచ్చి దావత్‌లలో వినియోగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయనికి భారీగా గండి పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైంది. ఆ శాఖ కమిషనర్‌ శ్రీధర్, ఎక్సైజ్‌ ఈడీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.


దావత్‌లు, పార్టీలు, ఈవెంట్లకు అనుమతులు తీసుకోకపోవడం, ఎలాంటి ట్యాక్స్‌లు చెల్లించని ఎన్‌డీపీఎల్‌ మద్యం వినియోగించడంపై నిఘా ఉంచుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో 302 కేసులు నమోదు చేశారు. మెుత్తంగా 165 మందిని నిందితులుగా చేర్చి 35 వాహనాలను సీజ్ చేశారు. రూ.61.13 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇకపైనా నిఘా కొనసాగుతుందని.. మద్యం వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Latest News
 

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రినే హతమార్చిన కూతురు Thu, Jul 10, 2025, 06:46 AM
హైదరాబాద్‌లో కల్తీ కల్లు తీవ్ర విషాదాన్ని నింపింది Thu, Jul 10, 2025, 06:42 AM
నిమ్స్‌లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స మొత్తం 20 మంది ఆస్పత్రిలో చేరిక Thu, Jul 10, 2025, 06:17 AM
కేసీఆర్, జగన్ వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి Wed, Jul 09, 2025, 11:07 PM
కల్లీ కల్లు మృతులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి: ఎంపీ ఈటల Wed, Jul 09, 2025, 09:39 PM