byసూర్య | Tue, Nov 21, 2023, 02:14 PM
ఈనెల 23న పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానం ఆవరణలో జిల్లాస్థాయి మహిళా కబడ్డి జట్టు ఎంపిక జరుగుతుందని జిల్లా కబడ్డి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శంకర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జూనియర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుండి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలోని ఆసక్తి కలిగిన క్రీడాకారిణిలు పాల్గొనాలని, పూర్తి వివరాలకు 9949842456, 9248046244 సెల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.