చెరువుల పునరుద్ధరణ బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది: ఎమ్మెల్సీ కవిత

byసూర్య | Thu, Jun 08, 2023, 02:55 PM

చెరువుల పునరుద్ధరణ బిఆర్ఎస్ ప్రభుత్వంతొనే సాధ్యమైందని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న చెరువుల పండగకు ఎమ్మెల్సీ కవిత బోధన్ ఎమ్మెల్యే షకీల్ హాజరయ్యారు. మండలం బిఆర్ఎస్ పార్టీ నేతలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. జానకంపేట్ చెరువు నుంచి బైక్ లతో ర్యాలీగా వచ్చారు. భారీ గజమాలతో ఎమ్మెల్సీ కవితను నేతలు ఘనంగా సత్కరించారు. జానకంపేట్ సాటాపూర్ గేట్ ప్రధాన కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ మరియు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఎడపల్లిలో చేపడుతున్నటువంటి చెరువుల పండుగను ప్రారంభించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ఎంతో పురోగతిని సాధించామని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రధాన ప్రథమ స్థానంలో ఉండి ఆదర్శప్రాయంగా నిలిచామన్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమల పథకాలను అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ రజిత ఎల్లయ్య యాదవ్, ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM