చెరువుల పండగను బహిష్కరించిన గంగపుత్రులు

byసూర్య | Thu, Jun 08, 2023, 01:08 PM

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం నిర్వహిస్తున్న చెరువుల పండగ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత రానున్న నేపథ్యంలో ఎడపల్లి మండల గంగపుత్రుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా గంగపుత్ర సంఘ సభ్యులు మాట్లాడుతూ గంగపుత్ర సొసైటీలో ఇతరులకు సభ్యత్వం ఇవ్వరాదని అన్నారు. గంగపుత్రుల కులవృత్తి దోపిడీకి కారణం అవుతున్న సమన్వయ కమిటీ వల్ల వచ్చిన మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ సర్కులర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గంగపుత్ర సొసైటీలను విడదీయరాదని ఆ సొసైటీలో ఇతరులకు సభ్యత్వం ఇవ్వరాదన్నారు. ఉచిత చేపల విత్తనాలపేరుతో నాసిరకం చేప పిల్లల విత్తనాలు పంపిణీ చేస్తున్నారని కాబట్టి ఉచిత చేప పిల్లల బదులు సొసైటీ అకౌంట్లో నగదు మొత్తాన్ని జమ చేయాలన్నారు.

సంప్రదాయ మత్స్యకారులు అంటే.. కేవలం చెస్తా గుడ్ల గంగపుత్రులనే ప్రభుత్వం గుర్తించాలన్నారు. గంగా తెప్పోత్సవం సికింద్రాబాద్, శంషాబాద్లో ప్రభుత్వమే అధికారంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫిషరీస్ చైర్మన్ పదవి గంగపుత్రులకు ఇవ్వాలని, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించాల కోరారు. జీవో నెంబర్ 6,4 ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అలాగే 98వ జీవోను సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎడపల్లి మండల గంగపుత్ర సంఘ సభ్యులు భారీగా పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM