కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు

byసూర్య | Thu, Jun 08, 2023, 01:03 PM

కేసీఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లని అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారం..తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్ లో జరిగిన సాగునీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ అంటే నీళ్లు. కేసీఆర్ అంటే… అమ్మ తీరు అలోచించడం అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి కేసీఆర్ దుఖించిన తీరును తాను చూశానని చెప్పారు. గతంలో ఎండిపోయిన పాలమూరు ఇవాళ పచ్చని పైట కప్పుకున్నదని సీఎం కేసీఆర్ సంతోషిస్తున్నారని తెలిపారు. 'మన బిడ్డలకు ఏమైనా సుస్తి చేస్తే వాళ్లు మంచిగయ్యేదాక వదిలిపెట్టం మనం. అమ్మ ప్రేమ అలా ఉంటుంది.


కేసీఆర్ ది తెలంగాణ పట్ల, రైతుల పట్ల తల్లి ప్రేమ.అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే సమయంలో రిజర్వాయర్ల నిర్మాణం, కాలువల తవ్వకం వంటి ప్రతీ చిన్న అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే అది భగీరథ ప్రయత్నం అనడంలో అతిశయోక్తి లేదు. శివునికి నెత్తి మీద గంగమ్మ తల్లి ఉంటే తెలంగాణ నెత్తి మీద కాళేశ్వరం గంగను తెచ్చింది సీఎం కేసీఆర్. ఇతం చేసిన ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు… కాళేశ్వర చంద్రశేఖర్ రావుగా పేరు మార్చకోవాలి' అని వ్యాఖ్యానించారు.కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలోనే కాకుండా యావత్తు భారతదేశంలో, ఆసియా ఖండంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని, అటువంటి ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 81 మీటర్ల నుంచి 613 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే అతిగోప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని స్పష్టం చేశారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ నేత దుర్మరణం Thu, Apr 18, 2024, 01:00 PM
విద్యార్థిని చితక బాదిన ఉపాద్యాయుడు Thu, Apr 18, 2024, 01:00 PM
నేడు బీ-ఫామ్‌ అందుకోనున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు Thu, Apr 18, 2024, 12:33 PM
నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు Thu, Apr 18, 2024, 12:12 PM
ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM