జలవనరులశాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం

byసూర్య | Thu, Jun 08, 2023, 12:14 PM

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కల్లూరు జలవనరులశాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బుధవారం జలవనరులశాఖ ఎస్ఈ ఆనందరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన చెరువులు కొన్ని శిథిలావస్థకు చేరుకోగా, మరికొన్ని ఆక్రమణలకు గురయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించడం, చెరువులలో పూడిక తీత పనులు, చెరువు కట్టలను పటిష్ట పరచడం లాంటి అభివృద్ధి పనులు చేపట్టి చెరువులలో జలకళ తీసుకొచ్చారని, చెక్ డ్యామ్లు నిర్మించి భూగర్భ జలాల శాతాన్ని పెంచారని పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 292 చెరువుల అభివృద్ధికి రూ. 71. 55 కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలల్లో 47, 191 ఎకరాలలో సాగు జరుగుతుందన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో 3 చెక్ డ్యామ్ల నిర్మాణం రూ. 6. 50 కోట్లతో నిర్మాణం చేపట్టారని, కొత్తగా మరో 11 చెక్ డ్యామ్ నిర్మాణం కోసం రూ. 34. 50 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. కల్లూరులో నీటిపారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీరు కార్యాలయం నిర్మాణం రూ. 1. 95 కోట్లతో ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జలవనరులశాఖ ఎస్ఈ ఆనందరావు, ఈఈ ఎం. లక్ష్మీనారాయణ, డీఈలు వెంకటేశ్వరరావు, రాజరత్నాకర్, వి. శ్రీనివాసరావు, జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్, రైతు సమితి మండల కన్వీనర్ డాక్టర్ రఘు, జిల్లా కమిటి సభ్యులు చంద ర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రామారావు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇస్మాయిల్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఏఈలు సాయిరామ్, సీతారామ్ ప్రసాద్, పద్మరాజ్, ఆయూష, శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM