ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అత్యాచారాలు

byసూర్య | Thu, Jun 08, 2023, 12:14 PM

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరుగుతున్నాయని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి, పీడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జానకి, జి. మస్తాన్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని లెనిన్ నగర్ లో ఏర్పాటు చేసిన సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఖమ్మంరూరల్ మండలం ఎదులాపురం పెట్రోల్ బంక్ సమీపంలో నివాసముంటున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు తీసుకొస్తున్నా. వాటిని పకడ్బందీగా అమలు చేయకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు రోడ్డు ఎక్కి ప్రజలతో కలిసి ఆందోళన చేసే వరకూ పోలీసులు, వైద్యులు బాధిత చిన్నారిని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని, ప్రభుత్వాల వైఖరితోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ఈ సమావేశంలో సాగర్, ఆర్. రవికుమార్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM