సాగునీటి దినోత్సవంలో పాల్గొన్న మంత్రి

byసూర్య | Thu, Jun 08, 2023, 11:23 AM

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహేశ్వరంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్ జరిగిన తెలంగాణ సాగునీటి దినోత్సవంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.... " కాలేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ని పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు తీసుకువస్తామని అన్నారు. కృష్ణా బ్యాక్ వాటర్ తో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు కోర్టులలో కేసులు వేస్తూన్న అటు న్యాయ పోరాటం చేస్తూ, మరో వైపు కేంద్రం ద్వారా కృషి చేస్తున్నాం. గోదావరిలో 32 టీఎంసీ లు కృష్ణాలో 23 టీఎంసీ ల నీటితో ఆయా ప్రాంతాల్లో రిజర్వాయర్లు కట్టుకొని తాగునీటిని ప్రభుత్వం అందిస్తుంది. ముందు డ్రింకింగ్ వాటర్, ను తీసుకువచ్చి అనంతరం సాగునీటిని తెచ్చి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ల కాలంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన అయిన కాలేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారని అన్నారు. గతంలో 2014 కు ముందు రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే నేడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని, మన రాష్ట్రం పంజాబ్ ను దాటిందన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో జలకళ సంతరించుకుందని, భూగర్భ జలాలు పెరిగి, బోర్లలో నీరు పుష్కలంగా ఉందని, పశువులకు నీరు లభిస్తుందని అన్నారు.


గతంలో ఎన్నడులేని విధంగా చెరువుల్లో చేపలు వదులుతూ మృత్సకారులకు, ముదిరాజ్ కులస్తులకు ఆర్థికంగా లబ్ది చేకూరుతుందన్నారు. గతంలో మన జిల్లాలో చెక్ డ్యాంలు నిషేధం ఉండగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టడానికి అనుమతి ఇవ్వటంతో వాటిలో నీటి నిల్వతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణలో ఏ రంగం వెనుక బడిందో, ప్రజలకు ఎం చేయాలో ఆలోచించి, ఉద్యమ నాయకులే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలు మెచ్చిన పాలన కొనసాగిస్తున్నారన్నారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ అనే పదం పలుకటానికి కూడా నాయకులు జంకే వారని, తమ రాజకీయ జీవితం ఎక్కడ అంధకారంలోకి వెళ్తుందని భయపడేవారని కానీ నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ యాసలో సినిమా తీసినా, తెలంగాణ బిడ్డలు హీరోలుగా నటించిన ప్రజాధారణ పొందుతున్నాయని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రతి ఎకరాల్లో ఏ పంట వేసుకుంటున్నారో అనే లెక్క ప్రభుత్వం వద్ద ఉందని, రైతులకు రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM