తన బిల్డింగ్‌ను కూల్చేశారంటూ జీహెచ్‌ఎంసీ అధికారులపై ,,,హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బాధితులు

byసూర్య | Wed, Jun 07, 2023, 08:34 PM

తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ దుమారానికి కారణమైన గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలైన నందకుమార్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ధిక్కరణకు పాల్పడి తన స్థలంలో ఉన్న బిల్డింగ్‌ను కూల్చేవేశారంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్, మరో ముగ్గురు టౌన్ ప్లానింగ్ అధికారులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.


జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జూబ్లీహిల్స్ జోనల్ కమిషనర్ రవితేజ, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్‌లపై చర్యలు తీసుకోవాలని నందకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ తన ఇంటిని కూల్చివేశారని ఆరోపించాడు. గత ఏడాది నవంబర్ 11న రిట్ పిటిషన్ 18529/ 2021, మరో రిట్ పిటిషన్ 18645/2021లో హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను జీహెచ్‌ఎంసీ అధికారులు అసలు పట్టించుకోలేదని నందకుమార్ చెబుతున్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. త్వరలో దీనిపై విచారణ చేపట్టనుందని తెలుస్తోంది.


అయితే గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో కలకలం రేపింది. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మధ్యవర్తుల ద్వారా బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లు కేసీఆర్ ఆరోపించగా.. ఇదంతా కేసీఆర్ డ్రామా అంటూ బీజేపీ నేతలు కొట్టిపారేశారు. తాము అసలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించలేదంటూ యాదాద్రిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం కూడా చేశారు. ఈ కేసులో తెలంగాణకు చెందిన నందగోపాల్ కీలక నిందితుడిగా ఉన్నాడు. ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును సిట్‌కు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ పిటిషన్ వేసింది. హైకోర్టు సీబీఐకు అప్పగించినా తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చుకుంది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారందరూ బెయిల్‌పై బయటకొచ్చారు.



Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM