ప్రియురాలిని ధారుణంగా చంపి.... ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

byసూర్య | Wed, Jun 07, 2023, 08:31 PM

ఢిల్లీలోని మహిళ హత్య ఘటన  మరవకముందే బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించి అక్కడి నుండి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెదిన ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం గోదావరిఖని ప్రాంతానికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఆయన కూతురు ఆకాంక్ష బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. అక్కడే జీవన్ భీమా నగర్ పరిధిలోని కోడిహళ్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది.


ఆకాంక్ష పని చేస్తున్న కంపెనీలోనే అర్పిత్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత ఐదు సంవత్సరాలుగా వీరిమధ్య ప్రేమాయణం కొనసాగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇద్దరు మధ్య తరుచుగా గొడవలు జరగుతున్నాయి. నిన్న (మంగళవారం) ఆకాంక్ష ఉన్న ఫ్లాట్‌కి ఆమె స్నేహితులు వెళ్లగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్‌కు గురైన స్నేహితులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఆకాంక్ష ప్రియుడు అర్పిత్ సోమవారం రాత్రి ఆమె ఫ్లాటుకు వచ్చినట్లుగా తేలింది.


ఆకాంక్షను అతడే గొంతునులిమి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆపై దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చంపేసిన తర్వాత ఆమెను ఫ్యానుకు ఉరేసి.. అక్కడి నుంచి పారిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న అర్పిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువతి మరణ వార్తతో గోదావరఖనిలోని వారి నివాసం వద్ద విషాదం అలుముకుంది. ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.



Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM