మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు: మంత్రి

byసూర్య | Wed, Jun 07, 2023, 06:26 PM

నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సెయింట్ ఫౌండేషన్ మరియు శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మెట్టుగడ్డ లో ఉన్న బాలికల ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి రేపు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్, సెయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల పాటు నిర్వహించిన నైపుణ్య శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసే కార్యక్రమం మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో మెట్టుగడ్డ- పిల్లలమర్రి రోడ్డులో ఉన్న ఐటిఐ బాలికల కళాశాల వద్ద మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ జీ రవి నాయక్, ఎస్పీ కె నరసింహ, ఇతర అధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు. 


ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. మార్చి నెలలో ప్రారంభమైన నైపుణ్య శిక్షణ శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు రేపు కేటీఆర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేయడమే కాకుండా వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో హాస్టల్ వసతి కూడా ఉంటుందని ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. మహిళలకు నైపుణ్యాలను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆలోచన చేసిన సెయింట్ ఫౌండేషన్ నిర్వాహకురాలు ప్రద్యుమ్న, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహితలను మంత్రి అభినందించారు. యువజన సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో ఇప్పటికే 45 కోర్సుల్లో యువతకు శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని న్యాక్ ఆధ్వర్యంలోనూ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువతకు అండగా నిలిచామన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు. రేపు ఉదయం 10: 30 గంటలకు మూసాపేట మండలం వేములలో కోజెంట్ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ అనంతరం ఉదయం 11: 30 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు భూమి పూజ చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆ తర్వాత పద్మావతి కాలనీ అయ్యప్ప గుట్ట సమీపంలో నిర్మించిన ఆధునిక వైకుంఠ దామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. తర్వాత మధ్యాహ్నం 1: 45 గంటలకు జడ్చర్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్తారని వెల్లడించారు. అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, సెయింట్ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంఛార్జి కృష్ణ దీవి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఎస్పీ మహేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM