గంజాయి పట్టివేత ఆదిలాబాద్ కు చెందిన నలుగురు అరెస్ట్

byసూర్య | Wed, Jun 07, 2023, 03:56 PM

భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ మరియు భద్రాచలం పోలీసులు సంయుక్త దాడులలో భాగంగా, బుధవారం మధ్యాహ్నం, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ, ఎస్సైలు సురేష్, శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది భద్రాచలం కూనవరం రోడ్డు సి. ఆర్. పి. ఎఫ్. చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్ లు ఒకదాని తర్వాత ఒకటి అనుమానాస్పదంగా వస్తుండడంతో గమనించి ఆపీ చెక్ చేయగా, ఒక్కొక్క కార్ లో ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు వ్యక్తులు 100 కిలోల గంజాయితో పట్టుబడ్డారు.


వీరు, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోగల సీలేరు వద్ద కొనుగోలు చేసి భద్రాచలం గుండా వెళ్తూ ఆదిలాబాద్ లో గంజాయి వినియోగిదారులకు అమ్ముటకు అక్రమంగా తరలిస్తుండగా నలుగురిని పట్టుకోవడం జరిగింది. మరో తొమ్మిది మంది నేరస్థులు ఈ అక్రమ గంజాయి తరలింపులో పరారి లో ఉన్నారు. ఆదిలాబాద్ కు చెందిన ఒక కార్ పై మొహమ్మద్ అర్షద్ ఖాన్ & షేక్ అబ్దుల్ లు మరియు మరొక కార్ లో రహమాన్ ఖాన్ & కదం అభిజిత్ లు 100 కేజీలతో పట్టుబడ్డారు. పట్టుబడిన గంజాయి విలువ మొత్తం 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. భద్రాచలంలో ప్రస్తుతం రెండు పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణా నిరోధించడంలో భద్రాచలం పోలీసులు పై చేయి సాధించారు. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్సు మరియు భద్రాచలం పోలీసులను ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM