byసూర్య | Wed, Jun 07, 2023, 01:19 PM
ముషీరాబాద్ పరిధి రాంనగర్ లో యుగంధర్ అనే కానిస్టేబుల్ భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. 1999 బ్యాచ్ కు చెందిన యుగంధర్ నారాయణగూడ పిఎస్ లో విధులు నిర్వహిస్తున్నాడు. పదోన్నతిపై హెడ్ కానిస్టేబుల్ శిక్షణ కోసం కరీంనగర్ పిటిసి సెంటర్కు గత నెల 21న వచ్చాడు. శిక్షణ పొందుతుండగా అతని కాళ్లు చేతులు కడుపు ఉబ్బడంతో వెంటనే హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మళ్లీ శిక్షణకు వెళ్లగా మంగళవారం చనిపోయాడు. ఈ ఘటన పై కేసు నమోదైంది.