హైదరాబాద్ నగరంలో బ్యూరో డి ఫ్రాన్స్,,,త్వరలోనే ప్రారంభం

byసూర్య | Fri, Jun 02, 2023, 07:18 PM

భారత్‌లోని చైతన్యవంతమైన రాష్ట్రమైన తెలంగాణలో ‘బ్యూరో డి ఫ్రాన్స్‌’ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఎమ్మాన్యుయేల్ లెనేన్ తెలిపారు. కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ రాయబారి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ నగరంలో లీ బ్యూరో డి ఫ్రాన్స్‌ను 2003లో ఏర్పాటు చేయనున్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం గత ఏడాదే ప్రకటించింది. బ్యూరో డి ఫ్రాన్స్ అనేది ఓ సేవా కేంద్రంగా ఉపయోగపడనుంది. భారత విద్యార్థులు, ఫ్రెంచ్ యూనివర్సిటీల మధ్య; ఇరు దేశాల వ్యాపారాలకు సంబంధించి అనుసంధానకర్తగా ఉపయోగపడనుంది. ఈ కేంద్రం వీసాలను కూడా జారీ చేయనుంది.


2023 మలి భాగంలో ఈ కేంద్రం పని చేయడం మొదలుపెడుతుందని ఫ్రెంచ్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ న్యూ స్మార్ట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన సమయంలో పరిశ్రమలు, ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గతంలోనే తెలిపారు.  బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్‌కు అనుసంధానంగా హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న బ్యూరో డి ఫ్రాన్స్ పని చేయనుంది. హైదరాబాద్‌లోని కంపెనీలతో వ్యాపార సంబంధాలు ఏర్పర్చడానికి, దౌత్య సేవలు అందించడానికి ఇది ఉపయోగపడనుంది.


భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో 2022 సెప్టెంబర్ 15న సమావేశమైన సందర్భంగా ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరినే కోలోనా హైదరాబాద్‌లో బ్యూరో డి ఫ్రాన్స్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ విద్యార్థులకు వీసాలు ఇవ్వడంలో ఈ బ్యూరో కీలక పాత్ర పోషించనుంది. 2025 నాటికి 25 వేల మంది భారత విద్యార్థులను ఆకర్షించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఫ్రాన్స్‌‌కు చెందిన సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, సాఫ్రాన్స్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ అండ్ మనే ఇండియా ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఇండస్ట్రియల్ పార్కులో ష్నైడర్ రూ.300 కోట్లతో స్మార్ట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (IFCCI) ఆఫీస్ సైతం ఏర్పాటైంది.



Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM