హార్ట్ ఎటాక్‌తో షటిల్ ఆడుతూ కుప్పకూలిపోయిన వ్యక్తి

byసూర్య | Fri, Jun 02, 2023, 07:17 PM

ఇటీవల వరకు తెలుగు రాష్ట్రాల్లో హార్ట్ ఎటాక్ ఘటనలు పదుల సంఖ్యలో చోటుచేసుకున్నాయి. అయితే కొద్దిరోజులుగా అలాంటి మరణాలు తగ్గుముఖం పట్టాయనుకుంటుండగానే జగిత్యాలలో తాజాగా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం స్నేహితులతో కలిసి షటిల్ ఆడిన ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.  ఘటన వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బూస వెంకటరాజ గంగారం (53) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం క్లబ్‌కి వెళ్లి స్నేహితులతో కాసేపు షటిల్ ఆడారు. బాగా అలసిపోయిన ఆయన కాసేపు పక్కన నిలబడ్డాడు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో షాక్‌కు గురైన స్నేహితులు, ఇతర ఆటగాళ్లు ఆయనకు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ స్పృహలోకి రాకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన డాక్టర్లు అప్పటికే ప్రాణం పోయిందని చెప్పడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.


అప్పటి వరకు అందరితో కలిసి షెటిల్ ఆడిన గంగారం తమ కళ్ల ముందే చనిపోవటంతో స్నేహితులు షాకయ్యారు. కొన్నేళ్లుగా అందరం కలిసి షెటిల్ ఆడుతున్నామని.. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పకూలిన వెంటనే సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించినా.. తమ స్నేహితుణ్ని కాపాడుకోలేకపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు రోజూలాగే షటిల్ ఆడి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన గంగారం విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గంగారం ఒక్కసారిగా కుప్పకూలడం, ఆయనకు సీపీఆర్ చేస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.



Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM