వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

byసూర్య | Fri, Mar 31, 2023, 10:02 PM

సినిమాల్లో పోలీసులు ఎపుడూ ఆలస్యంగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అది నిన్నటి మాట. సాంకేతికత పెరిగాక పోలీస్ వ్యవస్థలో ఎంతో మార్పు వచ్చింది. ఇదిలావుంటే పోలీసుల డయల్ 100కు ఓ కాల్ వచ్చింది.. ఓ యువతి ఆత్మహత్యకు యత్నిస్తోందని సమాచారం ఇచ్చారు... ఇంటి అడ్రస్ కానీ.. లొకేషన్ కానీ.. ఏదీ తెలియదు... మిగతా ఎలాంటి సమాచారం లేదు. అయితేనేం.. తమ బాధ్యత తాను నిర్వహించాడు ఓ కానిస్టేబుల్. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ యువత ప్రాణాన్ని రక్షించాడు. హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా 100కు డయల్ చేసి సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియదు.. దీంతో ఏం చేయాలో అర్థం కాక కానిస్టేబుల్ భాస్కర్ అదే నెంబర్‌కు ఫోన్ చేయగా పిల్లల శబ్దం తప్ప ఎటువంటి సమాధానం రాలేదు... దీంతో కానిస్టేబుల్ భాస్కర్ ఎంతో చాకచక్యంగా కేవలం పిల్లల శబ్దాన్ని ఆధారంగానే చేసుకొని మూడు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని యువతిని రక్షించాడు.


రేష్మ అనే యువతి భర్తతో విభేదాలు కొనసాగుతూ ఉండడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని రేష్మ ఆత్మహత్య చేసుకుంటున్నా సమయంలో కానిస్టేబుల్ భాస్కర్ అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి యువతిని కాపాడాడు. 100కు డయల్ చేసిన కేవలం మూడు నిమిషాల్లోనే కానిస్టేబుల్ భాస్కర్ స్పందించి ఘటన స్థలానికి వచ్చి యువతిని రక్షించడంతో స్థానికులు అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. నిమిషం ఆలస్యమైన యువతి మరణించి ఉండేదని స్థానికులు తెలిపారు.


భర్తతో విభేదాలు ఉన్న కారణంగానే రేష్మ ఆత్మహత్యాకు యత్నించిందని పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగించారు. కానిస్టేబుల్ భాస్కర్ యువతి ప్రాణాలు కాపాడిన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అతన్ని అభినందించారు.



Latest News
 

నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM
కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక Fri, Mar 29, 2024, 02:52 PM
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి Fri, Mar 29, 2024, 02:50 PM
దేవునిపల్లిలో ఒకరి అదృశ్యం Fri, Mar 29, 2024, 02:47 PM