టెన్ట్ పరీక్షల్లో స్వల్ప మార్పులు,,,తెలంగాణ సర్కార్ నిర్ణయం

byసూర్య | Wed, Mar 29, 2023, 07:30 PM

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి టెన్స్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి టెన్స్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. టెన్ట్ పరీక్షల్లో స్వల్ప మార్పులు చేశారు. పార్ట్ – B (ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నపత్రం ఇచ్చే సమయాన్ని మార్చారు. మారిన విధానం ప్రకారం.. ఫస్ట్ లాంగ్వేజీ, సెకండ్ లాంగ్వేజీ (హిందీ), సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టులకు చివరి అరగంట అంటే.. మధ్యాహ్నం12 గంటలకు పార్ట్– B క్వశ్చన్ పేపర్ ఇస్తారు. థర్డ్ లాంగ్వేజీ (ఇంగ్లిష్) పేపర్లు పార్ట్ –A, పార్ట్ –B రెండూ ఒకేసారి ఎగ్జామ్ ప్రారంభం కాగానే ఉదయం 9.30 గంటలకే విద్యార్థులకు ఇవ్వనున్నారు.


అయితే జనరల్‌ సైన్స్‌ పరీక్షలో ఫిజిక్స్, బయోలజీ సబ్జెక్టులకు 40 మార్కుల చొప్పున రెండు వేర్వేరు క్వశ్చన్ పేపర్లుంటాయి. ఉంటాయి. జనరల్‌ సైన్స్‌లో తొలుత ఓ పేపర్‌ను ఇచ్చి దానికి సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం 20 నిమిషాల సమయం ఇచ్చి విద్యార్థులకు రెండో పేపర్‌ ఇవ్వాలని తెలిపారు. రెండో పేపర్‌ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం కేటాయించాలని చెప్పారు. ఈ లెక్కన ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిజిక్స్ ఎగ్జామ్ జరుగనుంది. చివరి 15 నిమిషాల ముందు అంటే 10.45 గంటలకు పార్ట్-–బీ అందివ్వనున్నారు. 11 గంటలకు విద్యార్థుల నుంచి ఫిజిక్స్ ఆన్సర్ షీట్లు తీసుకున్నాక.. బయోలజీ క్వశ్చన్ పేపర్ ఇచ్చేందుకు 20 నిమిషాలు అదనంగా కేటాయించారు. అన్ని పరీక్షలకు 3 గంటలు, జనరల్ సైన్స్‌కు మాత్రం 3.20 గంటల సమయం ఇచ్చారు. ఈ మేరకు నిర్ణీత టైమ్ మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉండగా.., చివరి 15 నిమిషాల ముందు అంటే 12.35 నిమిషాలకు పార్ట్ –B పేపర్ అందించనున్నారు.


షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు పూర్తవుతాయి. ఏప్రిల్ 13తో ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లీష్, 8న మ్యాథ్స్ , 10న జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరగనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షకు 4,94,620 మంది విద్యార్థులు హాజరు కానుండగా... వారికోసం 2,652 పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు.



Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM