నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం,,,విదేశీ ప్రయాణం కోసం ఎయిర్ పోర్ట్ కు వెళ్తుండగా

byసూర్య | Sun, Mar 19, 2023, 02:25 PM

గాలిలో ఎగిరి విదేశాలకు వెళ్లాల్సిన ఆమె రోడ్డు ప్రమాదంతో అనంతలోకాలకు చేరుకొంది.  మరికొన్ని గంటల్లో అమెరికా ప్రయాణం. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని కారులో విమానాశ్రయానికి బలయల్దేరారు. కానీ ఊహించని విధంగా ఎదురైన ప్రమాదం ఆమెను అనంతలోకాలకు పంపంది. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మడలం చీకటిగూడెం గ్రామశివారులో గతరాత్రి (శనివారం) చోటు చేసుకుంది.


పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన కరణం పద్మా నాయుడు కుటుంబం కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లింది. అక్కడే ఆయన కుటుంబం స్థిరపడింది. అప్పుడప్పుడూ విజయవాడకు వస్తూ ఉండేవారు. ఈక్రమంలో ఇటీవల వారి బంధువుల కుటుంబంలో ఓ వివాహం జరిగింది. ఆ వేడుకకు పద్మా నాయుడు కుమార్తె ప్రీతి వచ్చారు. పెళ్లి వేడుక ముగియటంతో ఆమె తిరిగి అమెరికా వెళ్లేందికు సిద్ధమయ్యారు. శనివారం రాత్రి ప్రీతి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రీతిని విమానాశ్రయంలో విడిచిపెట్టేందుకు సమీప బంధువులు శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు.


కారు కేతేపల్లి మడలం చీకటిగూడెం శివారుకు రాగానే సూర్యాపేట నుంచి హైదరాబాద్‌ వెళుతున్న గుర్తు తెలియని వాహనం ప్రీతి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు విజయవాడ నేషనల్ హైవేపై మూడు పల్టీలు కొట్టింది. తలకు తీవ్ర గాయాలైన ప్రీతి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. కారు డ్రైవ్ చేస్తున్న దొప్పలపూడి శ్రేయాస్‌, కారులో ప్రీతితో పాటు ప్రయాణిస్తున్న దివి విశ్వవిఖ్యాత్, చేకూరి సరిత, దివి పద్మావతిలకు తీవ్ర గాయాలు అయ్యాయి.


విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాసేపట్లో అమెరికా వెళ్లాల్సి ఉండగా.. ఉహించని ప్రమాదంతో ప్రీతి కుటంబంలో విషాదం అలుముకుంది.


Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM