మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర

byసూర్య | Sun, Feb 05, 2023, 08:33 PM

హత్ సే హత్ జోడో అభియాన్‌లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర రేపు.. మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలు దేరనున్నారు. వరంగల్ హైవే మీదుగా ములుగుకు బయలుదేరతారు. అనంతరం ములుగులోని గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయానికి చేరుకుని.. ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం.. సరిగ్గా 12 గంటలకు రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు.


అయితే.. రేవంత్ రెడ్డి పాదయాత్ర.. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు సాగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్‌లో భోజన విరామం ఉంటుంది. ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం రెండున్నరకు మళ్లీ పాదయాత్ర మొదలుపెడతారు. సాయంత్రం 4: 30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తీసుకుంటారు. పస్రా జంక్షన్‌లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు పస్రా నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. ‌రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుంటారు. రాత్రికి రామప్ప గ్రామంలోనే రేవంత్ రెడ్డి బస చేస్తారు.



Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM