డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది

byసూర్య | Sun, Feb 05, 2023, 08:18 PM

ఎలుకలు ఇండ్లనే కూల్చేస్తాయటా...దొంగతనం ఓ లెక్కా...సరిగ్గా ఓ బంగారు షాపులో అదే జరిగింది. ఓ నగల దుకాణంలో కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ని ఓ ఎలుక దొంగిలించింది. నమ్మశక్యం కావాల్లేదా.. నిజమండీ బాబూ.. ఓ నగల దుకాణంలో విలువైన డైమండ్ నెక్లెస్ ప్రదర్శనకు ఉంచారు. కాగా.. రాత్రి పూట జ్యువెలరీ దుకాణం మూసేశాక.. ఎవ్వరు లేరని నిర్ధారించుకున్న ఎలుక.. మెల్లగా వచ్చింది. చుట్టుపక్కలా పరిశీలించింది.. ఎవ్వరు చూడట్లేదని గమనించి.. వెంటనే ఎలాంటి అలికిడి చేయకుండా నెక్లెస్‌ను నోట్లో కరచుకుని తీసుకెళ్లిపోయింది.


అయితే.. పొద్దున వచ్చిన దుకాణ యజమాని నెక్లెస్ లేకపోవటం చూసి అవాక్కయ్యాడు. దుకాణంలో దొంగతనం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. ఎలుకనే అసలు దొంగగా తేలిపోయింది. కాగా.. నెక్లెస్‌ను ఎలుక దొంగిలించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది పోలీస్ అధికారి చెప్పకపోవటం గమనార్హం.


ఈ వీడియోను.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన రాజేష్ హింగాంకర్ అనే ఐపీఎస్ అధికారి.. ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను పంచుకున్న రాజేష్ హింగాంకర్.. "ఈ ఎలుక డైమండ్ నెక్లెస్‌ను ఎవరి కోసం ఎత్తుకెళ్లి ఉంటుంది?" అనుమానం వ్యక్తం చేశారు. ఆయన వేసిన ప్రశ్నపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "దొంగతనం.. అన్ని జాతులకూ సాధారణం" అని ఒకరు కామెంట్ చేయగా... "ఎలుకలు కూడా హారాలు పెట్టుకుంటాయి" అని మరో వ్యక్తి రాసుకొచ్చారు. "ఈ ఎలుకను పట్టుకుంటే ఎన్నాళ్లు శిక్ష పడుతుంది" అని మరొకరు ప్రశ్నించగా.. మరో వ్యక్తి ఇంకో అడుగు ముందుకేసి.. "ఈ ఎలుక ఫిబ్రవరికి సిద్ధమవుతున్నట్లుంది.. అందుకే తన ప్రేయసికి వాలైంటైన్స్ డే గిఫ్ట్‌ కింద డైమండ్ నెక్లెస్ ఇచ్చేందుకు ప్లాన్ చేసింది" అంటూ కామెంట్ చేశారు.Latest News
 

రోడ్డు నిర్మాణానికి భూమిపూజ Tue, Mar 28, 2023, 01:44 PM
లాలాపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం Tue, Mar 28, 2023, 01:43 PM
రాజన్నను దర్శించుకున్న బలగం సినిమా దర్శకుడు ఎల్దండి వేణు Tue, Mar 28, 2023, 01:42 PM
నేడే ద్విచక్ర వాహనాల పంపిణీ Tue, Mar 28, 2023, 12:46 PM
కవితకు మరోసారి ఈడీ నోటీసులు Tue, Mar 28, 2023, 12:31 PM