కేసీఆర్‌ది దిక్కుమాలిన ప్రభుత్వం....వై.ఎస్.షర్మిల

byసూర్య | Sun, Feb 05, 2023, 08:17 PM

కేసీఆర్‌ది దిక్కుమాలిన ప్రభుత్వం అని.. ఆయన పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌ను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలనకు మరికొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉందని.. ఇప్పటికైనా హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. వరంగల్ జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిల కేసీఆర్‌కి మారు పేరు 420.. కేసీఅర్ ఒక మోసగాడు. లిక్కర్ స్కాంలో కవిత, రియల్ ఎస్టేట్ దందాలో కేసీఆర్ ఉన్నారు. కెసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉండి అబద్ధాలు బుకాయిస్తున్నారు. రాష్ట్రంలో ఎనిమిదిన్నర వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మీరు మాత్రం ఆత్మహత్యలు లేవు అని అంటున్నారు. రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలి. రైతులు తెలంగాణలో అప్పులపాలయ్యారు. ఇదే వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా పంట నష్ట పరిహారం అందలేదు. కేసీఆర్‌ది దిక్కుమాలిన పాలన.


అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. చిన్న దొర తమది కేసీఆర్ కుటుంబ పాలన అని చెబుతున్నారు. రాష్ట్రం అంతా ఆయన కుటుంబం అంట. ఎవరి కుటుంబం కోసం పని చేస్తున్నారు ? మీ ఇంట్లో మాత్రమే 5 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణాలు మాఫీ కాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళు కుటుంబ సభ్యులు కారా ? రాష్ట్రంలో నిరుద్యోగం లేదని చెబుతున్నారు. కేసీఆర్ తన మొదటి ప్రభుత్వంలో 65 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. రెండో ప్రభుత్వంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం నింపలేదు. ఉద్యమంలో గ్రూప్ 1 పరీక్షలు రాయెద్దు అని చెప్పారు. స్వరాష్ట్రంలో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా నింపలేదు. అని షర్మిల ఫైర్ అయ్యారు.


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM