సిరిసిల్ల, సిద్దిపేటలో నా పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా...రఘునందన్ రావు

byసూర్య | Sun, Feb 05, 2023, 06:08 PM

సిరిసిల్ల, సిద్దిపేటలో తన పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. దమ్ముంటే దుబ్బాకకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఛాలెంజ్ చేశారు. కాగా.. నిన్న అసెంబ్లీ వేదికగా.. ఎంఐఎం పార్టీ 50 స్థానాల్లో పోటీ చేస్తామని చేసిన ప్రకటనపై స్పందించారు రఘునందన్ రావు. 50 కాదు.. మొత్తం 119 సీట్లలో ఎంఐఎం పోటీ చేయాలన్నారు. 15 సీట్లు గెలిచి మళ్లీ బీఆర్ఎస్ కింద పనిచేస్తానని అక్బరుద్దీన్ అనటం సిగ్గుచేటన్నారు. మరోవైపు.. సీఎం కేసీఆర్ బీహార్‌కు సంబంధించిన వ్యక్తేమో అన్న అనుమానం వస్తుందన్నారు. బీహార్ అధికారులనే తెలంగాణ సీఎస్, డీజీపీగా నియమించారన్న రఘునందన్ రావు.. 93 మంది ఐపీఎస్ బదిలీల్లో తెలంగాణ ఐపీఎస్ అధికారులకు ఒక్కరికి కూడా ప్రాధాన్యం ఉన్న పోస్టు ఇవ్వలేదని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని.. గట్టిగా మాట్లాడే విపక్షాల నేతలను అరెస్టు చేసేందుకు మంచి పోస్టులు ఇచ్చారన్నారు రఘునందన్ రావు.


స్టీఫెన్ రవీంద్ర అనే అధికారి.. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న వారిని రబ్బరు బుల్లెట్లతో కాల్చారని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ బీహార్ వ్యక్తి అని ఆంధ్రా వాళ్లు అంటే.. కాదని కాము వాదించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ.. ఇప్పుడు తమకే అనుమానాలు వస్తున్నాయన్నారు. తెలంగాణకు చెందిన హోం గార్డ్ నుంచి సీనియర్ ఐపీఎస్‌ల వరకు అందరూ.. కేసీఆర్ ఏం చేస్తున్నారో ఆలోచన చేయాలని రఘునందన్ రావు సూచించారు.


"జలద్రస్యంలో కేటీఆర్ లేడు... అమెరికాలో ఉద్యోగాలు చేసేవాడు. అసెంబ్లీలో మాకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నేనూ వకీల్ సాబ్‌నే.. తెలంగాణ ఉద్యమంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యమకారుల కోసం పనిచేసిన వ్యక్తిని నేను. తెలంగాణ మొత్తం మా కుటుంబం అని చెప్పుకునే కేటీఆర్.. ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను ఎందుకు ఆదుకుంటలేరు. పోలీసు కిష్టయ్య, డీఎస్పీ నళిని, శ్రీకాంతాచారి కుటుంబం తెలంగాణ కుటుంబం కాదా..?" అంటూ ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నించారు.



Latest News
 

తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM