తెలంగాణలో రాష్ట్రపతి పాలన రానుంది...ఉత్తమ్ కుమార్ రెడ్డి

byసూర్య | Sun, Feb 05, 2023, 06:07 PM

తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతోంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇదిలావుంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే ఇది ఎన్నికల సంవత్సరం కాగా.. ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి అధికార బీఆర్ఎస్.. ఎన్నికలకు వెళ్లనుందని వివక్ష నేతలు జోస్యం చెప్తున్నారు. అయితే... అదే కోవలో చేరారు మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాగా.. కేవలం ముందస్తుకు వెళ్తారనటమమే కాకుండా.. ముహూర్తం కూడా చెప్తున్నారు ఉత్తమ్. "ఈ నెలాఖరున తెలంగాణ శాసన సభ రద్దు కాబోతోంది.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతోంది." అంటూ కరాఖండిగా చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే స్థానంలో 50 వేలకు పైగా మెజార్టీ వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు. ఒకవేళ 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ కూడా విసురుతున్నారు.



Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM