తెలంగాణలో అప్పు లేని రైతు లేడంటూ ఆరోపించిన షర్మిల

byసూర్య | Sat, Feb 04, 2023, 12:27 AM

బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి మాత్రమే అయ్యిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. ఒకప్పుడు స్కూటర్‌ మీద తిరిగే కేసీఆర్.. ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారని పేర్కొన్నారు. నర్సంపేట నియోజక వర్గం నెక్కొండ మండల కేంద్రంలో వైఎస్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాట్లాడిన షర్మిల.. 9 ఏళ్లుగా కేసీఆర్ చేస్తుంది పచ్చి మోసమంటూ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూం అని రాష్ట్రంలో పేదలను మోసం చేశారని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని కబుర్లు చెప్తున్నారన్నారు. రాష్ట్రంలోని సర్కార్ బడులు మూసేసే దుస్థితిలో ఉన్నాయంటూ విమర్శించారు. మూడు ఎకరాల భూమి అని దళితులను మోసం చేశారని.. పోడు పట్టాలిస్తానంటూ గిరిజనులు, ఆదివాసీలను నయవంచన చేశారన్నారు. తెలంగాణ లో అప్పు లేని రైతు లేడని.. వాళ్లకు రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారన్నారు. తెంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 8 ఏళ్లలో ఉద్యోగాలు లేక వందల మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


"ప్రజల సమస్యల కోసం కేసీఆర్ బయటకు రాడు. కేవలం ఓట్ల కోసం మాత్రమే బయటకు వస్తాడు. ఓట్లు వేయటం అయ్యాక మళ్లీ తిరిగి కూడా చూడడు. ఈసారి కూడా ఎన్నికలు ఉన్నాయి. కేసీఆర్ మళ్లీ వస్తాడు. ఆకాశంలో చందమామ అంటాడు. కేసీఅర్ సర్కార్ కూలి పోవాలి. కేసీఅర్ ఫామ్ హౌజ్‌కే పరిమితం కావాలి. ప్రజల కష్టాలు చూస్తూ 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. మళ్ళీ వైఎస్సార్ పాలన ప్రతి గడపకు చేరుస్తాం. వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు.. అది కూడా మహిళ పేరు మీదే కట్టిస్తాం. వైఎస్సార్ ప్రతి పథకానికి జీవం పోస్తాం. మొదటి సంతకం భారీగా ఉద్యోగాల ఫైల్‌ మీదే పెడతా. అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి పెన్షన్‌లు ఇస్తాం." అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


 


 


 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM