ప్రత్యర్థి పార్టీల నేతలతో కేటీఆర్ ముచ్చట్లు..అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం

byసూర్య | Sat, Feb 04, 2023, 12:25 AM

ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను పలకరించి మంత్రి కేటీఆర్ అందర్ని విస్మయానికి గురిచేశారు.  ఇదిలావుంటే తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. శుక్రవారం రోజున మధ్యాహ్నం ప్రారంభమైన సమావేశాల్లో.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించిన అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అయితే.. అంతకుముందే ఓ ఇంట్రెస్టింగ్ సీన్ నెలకొంది. ఎప్పుడు ఉప్పు నిప్పులా విమర్శలు చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. అందులోనూ బీఆర్ఎస్‌పై పీకలదాకా కోపంతో ఉన్న ఈటల.. మంత్రి కేటీఆర్ ముచ్చట పెట్టుకోవటం విశేషం. అయితే గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాకముందు.. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ఉన్న దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి మంత్రి కేటీఆర్ పలకించారు. ఈటలతో స్పెషల్‌గా మాట్లాడారు. ఈ క్రమంలోనే.. హుజురాబాద్‌‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించగా.. అసలు తనను ఎవ్వరూ పిలవనే లేదంటూ బదులిచ్చారు ఈటల. కాగా.. ప్రభుత్వం చేపట్టే విధానాలు జనాల్లోకి తీసుకెళ్లే పద్ధతి సరిగ్గాలేదని ఈటల కేటీఆర్‌తో అన్నట్టు సమాచారం.


ఇదిలా ఉంటే.. ఈటల, కేటీఆర్ ముచ్చట పెడుతున్న సమయంలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా సంభాషణలో జాయిన్ అయ్యారు. తన వైపు నుంచి ఉన్న ఫిర్యాదులను కేటీఆర్‌తో పంచుకున్నారు. తనను కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించట్లేదని తెలిపారు. ఈ క్రమంలోనే కనీసం కలెక్టరేట్ ప్రారంభోత్సవానికైనా పిలవాలంటూ ఈటల అనటంతో.. అందుకు బదులుగా మంత్రి కేటీఆర్ చిన్న నవ్వు విసిరారు. అంతలోనే.. అసెంబ్లీలోకి గవర్నర్ వస్తున్నారంటూ చెప్పటంతో అందరూ తమ తమ స్థానాలకు వెళ్లి ఆసీనులయ్యారు. అదే సమయంలో.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా.. ఈటలను పలకరించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్, ఈటలను పలకరించటం.. ఇద్దరు కలిసి స్పెషల్‌గా మాట్లాడుకోవటం ఇప్పుడు ఇరు పార్టీల శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.



Latest News
 

గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM
ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం Sat, Apr 20, 2024, 12:32 PM
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య Sat, Apr 20, 2024, 12:30 PM
వైభవంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం Sat, Apr 20, 2024, 12:29 PM
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక Sat, Apr 20, 2024, 12:26 PM