ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Feb 02, 2023, 03:25 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మన ఊరు - మన బడి పథకం మొదటి దశ క్రింద ఎంపిక చేయబడిన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని పిజి రోడ్ లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 8. 24 లక్షలతో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు అభివృద్ది పనులను బుధవారం ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ హరిసింగ్ నాయక్, మహబూబాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు ప్రారంభించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అన్నీ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలని ఎమ్మెల్యే నిధులతో ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మన బడి పథకం చేపట్టి సకల సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానాన్ని గొప్ప భవిష్యత్తును పొందేలా అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్ధులు, తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని అలాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బయ్యారం బిఆర్ఎస్ మండల అధ్యక్షులు, వైస్ ఎంపీపీ తాత గణేష్, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ : రేవంత్ రెడ్డి Sun, Mar 26, 2023, 09:45 PM
మహారాష్ట్ర రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ పోటీ చేస్తుంది : సీఎం కెసిఆర్ Sun, Mar 26, 2023, 09:00 PM
కాంగ్రెస్ లోకి డీఎస్ రీఎంట్రీ Sun, Mar 26, 2023, 01:09 PM
అగ్రనేతలకు బిజెపి సంగారెడ్డి జిల్లా నాయకుల స్వాగతం Sun, Mar 26, 2023, 12:50 PM
గ్రేటర్ హైదరాబాద్ శివారు లో రోడ్డు ప్రమాదం Sun, Mar 26, 2023, 12:15 PM