హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ పై అవగాహన సదస్సు..

byసూర్య | Mon, Jan 30, 2023, 05:02 PM

హెచ్ఐవి ఎయిడ్స్ నివారణపై సోమవారం మాచారెడ్డి మండలంలోని భవానిపేట్ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా వద్ద కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఎయిడ్స్ నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను నాటిక కళారూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. కళాబృందం ప్రదర్శించిన నాటికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలకిషన్, కరోబార్ నర్సింలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM