ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కలెక్టర్

byసూర్య | Mon, Jan 30, 2023, 04:45 PM

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదు దారుల నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ మోతిలాల్ జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సమావేశ మందిరంలోఆయన ముందుగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అధికారులతో కలిసి ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాల సమర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ సర్వజనులహితం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని ఆయన కొనియాడారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల దరఖాస్తులను ఆయన స్వీకరించారు. పెన్షన్ లను సంబంధించిన దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు మొత్తం 35 దరఖాస్తులను ఆయన స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వీకరించిన ప్రతి ధరఖాస్తును పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘానికి ఒక ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయించాలని జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రావు, సభ్యులు ఖాజమైనుద్దీన్, తిరుపతయ్య లు అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ భూపాల్ రెడ్డి, డిఆర్డిఓ నర్సింగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నాన్న ఎలాంటి వాడో తెలుసు, బిడ్డ ఒత్తిడితోనే ఈ నిర్ణయం: కేకే కొడుకు విప్లవ్ కుమార్ Fri, Mar 29, 2024, 07:28 PM
బీఆర్ఎస్‌ పార్టీలో చెత్తంతా పోయింది, ఇక మిగిలింది వాళ్లే.. అసెంబ్లీ మాజీ స్పీకర్ Fri, Mar 29, 2024, 07:26 PM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు Fri, Mar 29, 2024, 07:23 PM
చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM