1, 366 సర్కారు స్కూళ్ల మూతకు రంగం సిద్ధం

byసూర్య | Sat, Jan 28, 2023, 11:59 AM

రాష్ట్రంలో సుమారు1, 366 సర్కారు స్కూళ్ల మూతకు రంగం సిద్ధమైంది. పిల్లలు లేరనే సాకుతో ఆయా బడుల్లో టీచర్ల ఖాళీలను ప్రభుత్వం చూపించడం లేదు. దీంతో జీరో ఎన్​రోల్​మెంట్​ఉన్న బడులు శాశ్వతంగా మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో వాటిల్లో టీచర్ పోస్టులూ మాయం కానున్నాయి. స్టేట్​లో 26 వేలకు పైగా స్కూళ్లుండగా, వాటిలో ఈ ఏడాది1, 366 స్కూళ్లలో స్టూడెంట్స్​ చేరలేదు. గతంలోనూ జీరో ఎన్​రోల్​మెంట్ స్కూళ్లు ఉన్నా. కరోనా నేపథ్యంలో వందలాది స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం అవి కొనసాగుతున్నాయి. అప్పట్లో ఆయా స్కూళ్లకు శాంక్షన్ పోస్టులు ఉండటంతో, తిరిగి ఆ టీచర్లతో వాటిని నడిపించారు. ప్రభుత్వం తాజాగా చేపట్టిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో జీరో ఎన్​రోల్​మెంట్ ఉన్న స్కూళ్లలో టీచర్లను చూపించొద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆ టీచర్ పోస్టులు ఇక లేనట్టేనని తెలుస్తోంది. గతంలో జరిగిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో జీరో ఎన్​రోల్​మెంట్ స్కూళ్లలోని ఖాళీలనూ చూపించేవారు. ఆ స్కూళ్లకు అలాటైన టీచర్లను డిప్యూటేషన్​పై ఇతర బడులకు పంపేవారు. కానీ ఈ ఏడాది ఆ విధానాన్ని ప్రభుత్వం మార్చేసి, ఆ పోస్టులను చూపించకపోవడంతో టీచర్ పోస్టులు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సర్కారు రిలీజ్ చేసిన జీవోలోనే స్పష్టంగా పేర్కొన్నా, దీనిపై ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం, విద్యార్థి సంఘం కూడా మాట్లాడకపోవడం గమనార్హం.  


జీరో ఎన్​రోల్​మెంట్ ఉన్న స్కూళ్లు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 131, మహబూబాబాద్ జిల్లాలో 123 ఉన్నాయి. వరంగల్ లో 97, కుమ్రం భీంలో 71, రంగారెడ్డి, సూర్యాపేటలో 58 చొప్పున, ఆదిలాబాద్, జనగామలో 52 చొప్పున ఉన్నాయి. జోగుళాంబ గద్వాలలో మూడు, మేడ్చల్ లో 8, హనుమకొండలో 9 బడులు జీరో అడ్మిషన్ల జాబితాలో ఉన్నాయి.  ఇవన్నీ మూతపడ్డట్టేనని అధికారులు చెప్తున్నారు. గతంలో మూతపడ్డ స్కూళ్లలోని టీచర్ పోస్టులను డీఈవో పోల్​లో పెట్టగా, వాటిని ఖాళీల జాబితాలో చూపించడం లేదు. భవిష్యత్​లోనూ ఈ స్కూళ్లదీ అదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM