![]() |
![]() |
byసూర్య | Fri, Jan 27, 2023, 02:35 PM
బీబీ పేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుతారి రమేష్ శుక్రవారం మాట్లాడుతూ బీబీపేటలో అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన విధంగా బీబిపేటలో కూడా డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డివైడర్ లేకపోవడంతో అనేక యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయారు అని గతంలో కూడా రోడ్డు వేసేటప్పుడు దీనిని అడ్డుకొని డివైడర్ వేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎం భూమా గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బోయిని సత్యం, కాంగ్రెస్ నాయకులు తోట నరసింహులు, మల్లు గారి మహేష్, పరకాల రవి, గిరిబాబు, తోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.