కొనసాగుతున్న డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు

byసూర్య | Fri, Jan 27, 2023, 11:14 AM

ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రాంగోపాల్ పేటలోని డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. భారీ క్రేన్ సాయంతో కూల్చివేత పనులను చేపట్టారు. గురువారం రాత్రి 11 గంటలకు బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభించారు. బిల్డింగ్ ముందు భాగం నుండి ఒక్కొక్క ఫ్లోర్ గోడ కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, పక్క బిల్డింగులకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా పనులు చేపట్టారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూల్చివేయడానికి మరో 4, 5 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.


మరోవైపు, డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత సమయంలో బిల్డింగ్ నుండి పొగలు రావడంతో,కూల్చివేత పనులను నిలిపివేశారు. బిల్డింగ్ ముందు మట్టితో హైట్ పెంచుతున్నారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు మట్టితో హైట్ ను పెంచిన తరువాత కూల్చివేత పనులను మళ్లీ మొదలుపెట్టారు.  బిల్డింగ్ ను కూల్చివేస్తున్న సందర్భంగా. దాదాపు 5 రోజుల పాటు రెండు వైపుల రోడ్డును మూసివేస్తామని ఇప్పటికే పోలీసులు వెల్లడించారు.  డెక్కన్ మాల్ బిల్డింగ్ పరిసర ప్రాంతంలోకి ఎవరూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM