రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది : బండి సంజయ్

byసూర్య | Thu, Jan 26, 2023, 08:47 PM

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా మోర్చా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వారి సమస్యలేమిటో తెలుసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారు.టీఆర్ ఎస్ పాలనలో వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధ్యయనం చేసి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని తెలిపారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM