![]() |
![]() |
byసూర్య | Thu, Jan 26, 2023, 05:43 PM
భారత గణతంత్ర 74వ దినోత్సవాన్ని పురష్కరించుకొని పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం ప్రాంగణంలో ఉచిత డయాబెటిక్ క్యాంపు నిర్వహించారు. సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం చెందిన ఆలయ ఫోర్ మెన్ కమిటి చైర్ మెన్ లు సి. శివ కుమార్ యాదవ్, పోసాని సురేందర్ ముదిరాజ్, మాజీ కార్పోరేటర్ శంకర్ ముదిరాజ్ ఈ ఉచిత డయాబెటిక్ చెకప్ క్యాంపు ను ప్రారంభించారు. సీనియర్ సిటిజన్లు, యువకులు పెద్ద సంఖ్యలో ఈ డయాబెటిక్ క్యాంపునకు క్యూ కట్టి టెస్ట్ లు చేయించుకున్నారు. ఈ కార్యక్రమములో రాజ్ కుమార్ ,మాధవ్ , శ్రీకాంత్ ,సాయి నాథ్, శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొని తగిన ఏర్పట్లు చేశారు.