మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠినచర్యలు: జిల్లా కలెక్టర్

byసూర్య | Wed, Jan 25, 2023, 04:14 PM

జిల్లాలో విద్యార్థులు మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యల పై డిసిపి సిహెచ్ రూపెష్ తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గుర్తించిన డ్రగ్ అడిక్షన్ కేసులు వివరాలను ఆరా తీశారు. జిల్లాలో మైనర్ విద్యార్థులను డ్రగ్స్, గంజాయి సరఫరా కొరకు వినియోగిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం ఉన్న పిల్లలను బాధితులుగా పరిగణించి వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, దీని కోసం జిల్లాలో అందుబాటులో ఉన్న సైకలాజిస్ట్ సేవలు విస్తృతంగావినియోగించు కోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా అబ్కారీ శాఖ డి. పి. ఈ. ఓ. ఆర్. మహిపాల్ రెడ్డి, జెడ్పీ. డిప్యూటీ సి. ఈ. ఓ. జి. వెంకట చైతన్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ టి. చందన, సైకియాట్రిక్ సాత్విక్ మైత్రి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.


Latest News
 

లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 03:25 PM
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో సిటీలో నీళ్లు బంద్ Thu, Feb 02, 2023, 03:18 PM