స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని నిరసన

byసూర్య | Wed, Jan 25, 2023, 02:41 PM

తెలంగాణ రాష్ట్రంలోని 18 లక్షలకు పైగా విద్యార్థుల స్కాలర్ షిప్పులు మరియు ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదలను డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షులు శివ చంద్ర మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన మొత్తం విద్యార్థులను అణచివేసే ధోరణితో నడుస్తుందని, నిత్యం రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతు విద్యార్థులను పట్టించుకోకుండా నిరుపేదలను విద్యకు దూరం చేస్తున్నారని, స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ రాక కాలేజీ యజమాన్యాలు విద్యార్థులను ముక్కుపిండి ఫీజులు వసూలు చేయడం, చెల్లించని విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపుతున్న సందర్భంలో పేద విద్యార్ధులు పై చదువులకు నోచుకోని దుస్థితి రాష్ట్రంలో కొనసాగుతుందనీ రాష్ట్రవ్యాప్తంగా విద్యావ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా అవుతున్న తనకేం పట్టనట్టుగా ఉంటున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలి లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులు, మొదలైన వాటిలో చదువుతున్న దాదాపు 18 లక్షల మంది విద్యార్థులకు 5300 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ చందులాల్ చౌహాన్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శివాజీ నరేష్, బీజేవైఎం నాయకులు శరత్ చంద్ర, అమర్, భారత్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM