లోన్ పేరిట ఆన్లైన్ మోసం

byసూర్య | Wed, Jan 25, 2023, 02:38 PM

ముద్ర లోన్ ప్రాసెస్ కోసం అని రూ. 90 వేలు కాజేసిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబ్ నగర్ జిల్లా , జడ్చర్ల పట్టణానికి చెందిన ఉషారాణి అనే మహిళ గత ఏడాది నవంబర్ 28వ తేదీన ఆన్లైన్ గూగుల్ లో ముద్ర యోజన లింకు ద్వారా పర్సనల్ లోన్ కోసం సర్చ్ చేసింది. ఇందుకోసం ఆమె పూర్తి వివరాలతో పాటు పేరు , ఉద్యోగం మరియు వాటితో బ్యాంకు స్టేట్మెంట్ లింకు చేసింది. నవంబర్ 29వ తేదీన 9719569854 , 7417542979 నెంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ముద్ర యోజన బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని మీ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయుటకు 7838599165 నంబర్ కి పేటియం ద్వారా డబ్బులు పంపించాలని అడిగారని. వారు అడిగినట్లుగా వారి ఫోన్ పే నెంబర్ ద్వారా రూ. 90, 344 పంపించినట్లు తెలిపారు. ఇట్టి లోన్ కోసం చాలా రోజుల నుంచి వేచి చూస్తుంది ఆ యువతి. ఆ లోన్ ఇంకా రాకపోవడంతో పాటు నేను పంపిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వడం లేదని. తను మోసపోయినట్లు గుర్తించి ఈనెల 24వ తేదీన (నిన్న) మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులు ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM