ఓటరు చైతన్యంతోనే రాజకీయాల్లో సమూల మార్పు

byసూర్య | Wed, Jan 25, 2023, 02:24 PM

ఓటరు చైతన్యవంతుడై ఓటు వేయడం ద్వారా రాజకీయాల్లో సమూల మార్పు సాధించవచ్చనీ చెన్నై పాలెం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లావూరి వెంకన్న నాయక్ అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం త్రిపురారం మండలంలోని చెన్నైపాలెం గ్రామంలో ఓటు ప్రాముఖ్యత విషయమై సామాన్య ఓటర్లకు అవగాహన కల్పించారు. సాంకేతికను ఉపయోగించుకుని సంపూర్ణ అభివృద్ధి సాధించాల్సిన ప్రస్తుత తరుణంలో ఓటర్లు దేశ, రాష్ట్ర, గ్రామ అభివృద్ధి పట్ల ఆసక్తి చూపే వారిని ఎన్నుకుంటే ప్రజలకు ఓటర్లకు మేలు జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటరు డబ్బు, మద్యానికి ఓటును విక్రయించుకోవద్దని సూచించారు.


నీతి నిజాయితీగా ఓటరు ఓటు వేసినప్పుడే ప్రశ్నించే అవకాశం ఉంటుందని అన్నారు. ఓటరు చైతన్యవంతుడై ఓటు హక్కును వినియోగించుకోకపోతే భవిష్యత్తు అందకారంగా ఉంటుందని పేర్కొన్నారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు నమోదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నామరాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి జాఫర్, బి ఎల్ ఓ పుష్ప, వార్డు సభ్యురాలు ఎల్లమ్మ, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్, శ్రీనివాస్ ఉపాధ్యాయులు గోపి సత్యనారాయణ సైదయ్య సైదులు అంజమ్మ మక్ల నాయక్ ఎం ఎన్ స్వామి శ్రీదేవి దుర్గా మల్లేశ్వరి జ్యోతి తిరుపమ్మ రాము గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM
కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక Fri, Mar 29, 2024, 02:52 PM