పాలకవర్గం లేక.. ప్రత్యేక అధికారులు రాక

byసూర్య | Wed, Jan 25, 2023, 02:12 PM

నకిరేకల్ మండలంలోని ఏడు గ్రామాలలో రెండు సంవత్సరాల నుండి పాలకవర్గం లేక, ప్రత్యేక అధికారులు రాక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఆ గ్రామాలు తయారయ్యాయి. నకిరేకల్ మండలంలోని తాటికల్, చందుపట్ల, గొల్లగూడ, నెల్లిబండ, కడపర్తి, నోముల, చందనంపల్లి గ్రామాలలో 2019 సంవత్సరంలో అన్ని గ్రామాలతో పాటు ఏడు గ్రామాలకు ఎన్నికలు జరగలేదు. ఈ ఏడు గ్రామాలను 2011లో నకిరేకల్ మున్సిపాలిటీలో చేర్చాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఏడు గ్రామాల ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా న్యాయస్థానం 2013లో గ్రామాలను నకిరేకల్ మున్సిపాలిటీ నుండి విలీనాని రద్దు చేశారు. తర్వాత 2015లో ఏడు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించగా వీటికి 2020 డిసెంబర్ 15తో పాలకవర్గం గడువు ముగిసింది.


అప్పటినుండి ఈ ఏడు గ్రామాలలో ఎన్నికలు జరగకపోవడంతో మండల స్థాయి ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. కానీ ప్రత్యేక అధికారులు వారి సొంత విధులు పట్టించుకోని గ్రామాలను సరిగా పట్టించుకోవడంతో ఎక్కడ తీసిన గొంగడి అక్కడే అనే విధంగా ఈ ఏడు గ్రామాలు తయారయ్యాయి.


ఏడు గ్రామాలు ప్రత్యేక అధికారులు రాకపోవడంతో గ్రామంలోని కార్యదర్శులపై పని భారం పెరిగిపోయింది. దీనితో గ్రామాల్లోని నీటి సరఫరా, పరిశుద్ధత, విద్యుత్ దీపాల సమస్య, వంటి సమస్యలు గ్రామంలో రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వీటిని అధికారులు పరిశీలించలేక పోవడంతో గ్రామంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామాలలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడితే ప్రతి సమస్యకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కవలసి వస్తుందని ప్రజలు తెలుపుతున్నారు.


Latest News
 

సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM
కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక Fri, Mar 29, 2024, 02:52 PM
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి Fri, Mar 29, 2024, 02:50 PM