వేడెక్కిన ఖమ్మంజిల్లా రాజకీయాలు...వై.ఎస్.షర్మిలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ

byసూర్య | Wed, Jan 25, 2023, 01:39 PM

ఖమ్మం జిల్లా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో భేటీ అయ్యారు. ఆ పార్టీ నేతలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న పొంగులేటి.. కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఖమ్మంలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన తొలి బహిరంగ సభకు కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరనున్నారంటూ వదంతులు వ్యాప్తి చెందాయి. బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా వైఎస్‌ షర్మిలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.


పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంట్లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతలు, అనుచరులు పొంగులేటి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగేందుకు ఏమాత్రం అవకాశం లేదని అన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు బాగుంటుందనే అంశంపై అనుచరుల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్‌ఎస్‌‌లో చేరడానికి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీగా పొంగులేటికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో నేటికి సత్సంబంధాలు ఉన్నాయని అనుచరులు చెబుతారు. ఈ నేపథ్యంలో షర్మిలతో పొంగులేటి భేటీ కావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM