ఇక నుంచి వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి,,,ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సిందే

byసూర్య | Wed, Jan 25, 2023, 01:38 PM

వ్యాపారులకు ఇక నుంచి పోలీస్ లైసెన్స్ తప్పనిసరి చేస్తూ హైదరాబాద్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ట్రేడ్, పుడ్ లైసెన్స్, ఫైర్ ఎన్‌వోసీతో పాటు పోలీసు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. 2014 తర్వాత లైసెన్స్‌లను సిటీ పోలీసులు రద్దు చేశారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత పోలీస్ లైసెన్స్ నిబంధనలను మళ్లీ అమలు చేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.


స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్, కాఫీ షాప్, టీ స్టాల్, కేఫ్, బేకరీ రెస్టారెంట్, ఐస్ క్రీమ్, పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్ సెంటర్లు


లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశించింది అలాగే సినిమా థియేటర్ మాటోగ్రఫీ, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్పత్తులు ఈ లైసెన్సులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సుల కోసం వ్యాపారస్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని వెల్లడించింది.


పోలీస్ లైసెన్స్ కోసం రుసుం కూడా చెల్లించాల్సి ఉంది. వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.15000 వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుందని హైదరాబాద్ పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. hyderabadpolice.gov.in వెబ్‌సైట్ ద్వారా జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సు, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను జత చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని పబ్‌లు కూడా పోలీస్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు..


 


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM