సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jan 25, 2023, 01:27 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని షిర్డీ హిల్స్ బ్లాక్-ఏ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు మారయ్య, కాలనీ ప్రెసిడెంట్ సీహెచ్ దాసు, జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, క్యాషియర్ శేషు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM
మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభం Wed, Feb 01, 2023, 07:54 PM