బీజేపీ నేతల నేతల మాదిరిగా చౌకబారు విమర్శలు చేయం,,,సత్యవతిరాథోడ్‌

byసూర్య | Wed, Jan 25, 2023, 12:55 PM

సాగులో ఉన్న గిరిజనులకు నష్టం జరగకుండా పోడు భూములకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేస్లాపూర్‌కు తీసుకువచ్చి హక్కు పత్రాలిప్పిస్తామని  గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతిరాథోడ్‌ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ గిరిజనుల సంక్షేమం కోసం పాటు పడుతుందని చెప్పారు. బీజేపీ నేతల నేతల మాదిరిగా తాము చౌకబారు విమర్శలు చేయలేమని అన్నారు.


 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని 'నాగోబా జాతర' వైభంగా జరుగుతోంది. ఆదిలాబాద్‌తో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరపై నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం.. మంగళవారం జాతరలో దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతిరాథోడ్‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.


అంతకుముందు మంత్రులు అధికారులు నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన దర్బార్‌లో మాట్లాడిన గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్..  రాష్ట్రంలో 3.08 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములకు రైతు బంధు పథకం అమలవుతోందని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం జోడేఘాట్‌లో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులను చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ములుగులో ఏర్పాటుచేసే గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు విడుదల చేయలదన్నారు. బీజేపీ నాయకులు నాగోబా జాతరను సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కేస్లాపూర్ తీసుకొచ్చి పట్టాలిప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పోడు భూముల సర్వే పూర్తయిందని చెప్పారు. జిల్లాస్థాయిలో పరిశీలన పూర్తయ్యాక అటవీహక్కు పత్రాలు ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. గిరిజనుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గిరిజనలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని వెల్లడించారు. అదే సమయంలో బీజేపీపైనా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆచూకీ లేదని, కనిపించడం లేదంటూ పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. ఆదివాసీ ఆరాధ్య దైవమైన నాగోబా సన్నిధిలో అధికారికంగా నిర్వహించే దర్బార్‌కు కూడా రాలేదని విమర్శించారు. బీజేపీ నాయకులు కేవలం విమర్శలకు పరిమితమయ్యారు తప్ప చేసిన అభివృద్ది ఏం లేదని అన్నారు.


ప్రతి ఏటా గిరిజనుల సమస్యలపై నాగోబా దర్బార్‌లో చర్చించటం ఆనవాయితీ. స్వాతంత్ర్యానికి ముందు నుండి నాగోబా జాతరలో దర్బార్ నిర్వహించే సంప్రదాయం ఉంది. అదే ఆనవాయితీని ఈసారి పాటించారు. దర్బార్‌లో పోడుభూముల సమస్యలతో పాటు ఆదివాసీలకు మౌలిక సదుపాయాలపై గిరిజన పెద్దలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మెస్రం పెద్ద వెంకట్రావ్‌తో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.



Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM