ఆ బిల్డింగ్‌ను కూల్చేందుకుటెండర్లను ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ

byసూర్య | Wed, Jan 25, 2023, 12:54 PM

ఇళ్ల కట్టడానికే కాదు కూల్చడానికి కూడా లక్షల ఖర్చఅవుతుందని ఎవరికైనా తెలుసా....? ఇది వాస్తవం. ఇదలావుంటే ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని దక్కన్ మాల్‌ బిల్డింగ్‌ను కూల్చేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. ఈ మేరకు బిల్డింగ్‌ను కూల్చేందుకు సంస్థల నుంచి టెండర్లను జీహెచ్‌ఎంసీ ఆహ్వానిస్తోంది. చుట్టుపక్కల ఇళ్లకు నష్టం జరగకుండా బిల్డింగ్‌ను కూల్చే సంస్థలను ఎంపిక చేసే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. కూల్చేసిన తర్వాత శిథిలాలను ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. శిథిలాలు దాదాపు 20 వేల మెట్రిక్ టన్నులు వరకు ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.


బిల్డింగ్ కూల్చేయడం, శిథిలాలను వేరే ప్రాంతానికి తరలించడానికి దాదాపు రూ.41 లక్షల ఖర్చు అవుతుందని జీహెచ్‌ఎంసీ ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. రూ.33,86,268 లక్షలకు జీహెచ్‌ఎంసీ టెండర్ పిలిచింది. బిల్డింగ్ 18,90 చదరపు అడుగులు ఉండగా.. సెల్లార్ గ్రౌండ్‌తో పాటు మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూల్చేయనున్నారు. బుధవారం టెండర్లను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. త్వరగా బిల్డింగ్‌ను కూల్చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో.. అధికారులు వేగంగా ప్రక్రియ చేపడుతున్నారు.


అత్యాధునిక పరికరాలు ఉపయోగించి బిల్డింగ్‌ను కూల్చివేయాలని, దెబ్బతిన్న ఆర్‌సిసి స్లాబ్‌లు, షట్టర్లు, రాక్‌లు, కిటికీలు, వెంటిలేటర్లు, రాతి గోడలు, తలుపులు అన్నీ నేలకూల్చాలని టెండర్లలో పేర్కొన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, జీహెచ్‌ఎంసీ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విలిజెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుని కూల్చాలని స్పష్టం చేశారు. శబ్ధాలు, దుమ్మును నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్డింగ్‌ను కూల్చేయాలని టెండర్లలో షరతులు విధించారు.


అగ్నిప్రమాదం సంభవించడంతో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణం నష్టం కూడా జరిగింది. ఫైర్ యాక్సిడెంట్‌లో గల్లంతైన ముగ్గురిలో.. ఒకరి అస్థిపంజరం ఇటీవల బయటపడగా.. మిగతా ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. మిగతా ఇద్దరి అవశేషాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వారిద్దరి అవశేషాలు దొరికిన తర్వాత బిల్డింగ్ వెంటనే కూల్చేసే అవకాశముంది. ఇప్పటికే బిల్డింగ్‌కు పగుళ్లు రావడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో వీలైనంత త్వరగా బిల్డింగ్‌ను కూల్చేస్తే మంచిదని నిట్ నిపుణుల బృందం ఒక రిపోర్ట్ అందించింది.


ఆలస్యం చేస్తే మరింత ప్రమాదకరమని పేర్కొంది. దీంతో వీలైనంత త్వరగా బిల్డింగ్‌ను కూల్చివేసే ప్రక్రియ జీహెచ్‌ఎంసీ అధికారులు చేపడుతున్నారు. వేడి వల్ల బిల్డింగ్‌కు పగుళ్లు వచ్చాయని, ఏ క్షణమైనా కుప్పకూలవచ్చని నిపుణుల కమిటీ హెచ్చరించింది. ఆలస్యం చేయడం మంచిది కాదని రిపోర్టులో పేర్కొంది


 


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM