కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Wed, Jan 25, 2023, 12:52 PM

మేడ్చల్ మండలం డబిల్ పూర్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,పౌరులందరికీ ఐ స్క్రీనింగ్ చేస్తారు అని,చూపు లోపాలను సరిదిద్దడానికి అవసరమైన అన్ని కేసులను ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తారు అని,ఇతర కంటి సమస్యల అన్ని సేవలు ఉచితంగా అందిస్తారు అని , అవసరం ఉన్నవారికి మందులు ఇస్తారు అని,తీవ్రమైన కంటి వ్యాధుల నివారణపై పౌరులకు అవగాహన కల్పిస్తారు అని తెలిపారు.18 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రతిఒక్కరు కంటి వెలుగు ప్రయోజనాలు వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జిల్లా మార్కెట్ కమిటీ భాస్కర్ యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు నంద రెడ్డి, ఎంపీపీ రజిత రాజ మల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజేయందర్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్ గీత భాగ్య రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, అధికారులు, నాయకులూ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM
పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు Wed, Apr 24, 2024, 01:41 PM
ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు Wed, Apr 24, 2024, 01:41 PM