పవన్ కళ్యాణ్ కు అభివాదం చేసే ప్రయత్నంలో అభిమాని దుర్మరణం

byసూర్య | Tue, Jan 24, 2023, 11:32 PM

తమ అభిమాన నేతపై అభిమానం చాటడం అభిమానులు చేసే పని. ఇదిలావుంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కొండగట్టు, ధర్మపురి పర్యటన పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ తిరిగి బయల్దేరగా, ఆయన కాన్వాయ్‌ను కొంత మంది అభిమానులు ఫాలో అయ్యారు. పవన్ కాన్వాయ్ వెంట వెళ్తూ, తమ అభిమాన నేతకు అభివాదం చేసే ప్రయత్నం చేసి నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో తలకు తీవ్ర గాయమై ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ధర్మపురి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాన్వాయ్‌లోని ఓ కారును బైకు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తలలు పగిలి, తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలి ఒకింత భయానకంగా ఉంది.


పవన్‌ కళ్యాణ్ మంగళవారం (జనవరి 24) ఉదయం కొండగట్టు ఆలయాన్ని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ప్రచార రథం ‘వారాహి’కి పూజలు నిర్వహించారు. వేదపండితుల శాస్త్రోక్త పూజల అనంతరం వారాహి రథాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రచార రథం ఎక్కి, దానిపై నుంచి తొలి ప్రసంగం చేశారు.


అనంతరం జనసేన పార్టీ తెలంగాణ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. అక్కడి నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మపురి క్షేత్రం నుంచి ‘అనుష్టుప్‌ నారసింహ యాత్ర’కు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రంలో భాగంగా పవన్ కళ్యాణ్ దశల వారీగా 31 నారసింహ క్షేత్రాలను దర్శించుకోనున్నారు.


పవన్‌ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమాన నేతపై పూల వర్షం కురిపించారు. ఓపెన్‌ టాప్‌ వాహనం నుంచి పవన్‌ కళ్యాణ్ తన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ధర్మపురి పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్‌ తిరిగి బయల్దేరారు.



Latest News
 

నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM