అంటరానితనం నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గం: జగ్గారెడ్డి

byసూర్య | Tue, Jan 24, 2023, 08:09 PM

అంటరానితనాన్ని నిర్మూలించాలంటే విద్య ఒక్కటే మార్గమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జగ్గారెడ్డి అన్నారు. అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని... ప్రజల బాధలు, కష్టాలు, అవమానాలను చూసి అంబేద్కర్ చదువుకుని, ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పారు. కలియుగం ప్రారంభమైన తర్వాతే కులాలు, మతాల మధ్య పంచాయతీ ప్రారంభమయిందని ఆయన అన్నారు. అరుంధతి ఎస్సీ సామాజికవర్గానికి చెందినదని... రెడ్డి అయినా, బ్రాహ్మణుడు అయినా, మరే సామాజికవర్గానికి చెందిన వారైనా అరుంధతి నక్షత్రాన్ని చూడాల్సిందేనని చెప్పారు. 


హనుమంతుడికి ఉన్న బలం గురించి చెప్పిన జాంబవంతుడు కూడా ఎస్సీ సామాజికవర్గమేనని అన్నారు. అలాంటి జాంబవంతుడి కుమార్తె శ్రీకృష్ణుడిని పెళ్లాడిందని చెప్పారు. రాముడు, అల్లా మధ్య ఎలాంటి పంచాయతీ లేదని వారు కొట్టుకున్నట్టు మీరెప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని జగ్గారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM