నాలాలో పసికందు మృతదేహం...నాగర్ కర్నూలులో కలకలం

byసూర్య | Tue, Jan 24, 2023, 07:45 PM

అనైతిక బంధాలకు పసిబిడ్డలు బలవుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్ లోని నీళ్లు బయటకు వెళ్లడంలేదని నాలా తెరిచిన సిబ్బందికి అందులో రోజుల పసిగుడ్డు మృతదేహం కనిపించింది. దీంతో అవాక్కయిన సిబ్బంది.. ఆసుపత్రి అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. పసికందు మృతదేహం నాలాలో పడవేసింది ఎవరనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డెలివరీ వార్డులో ఈ దారుణం జరిగింది. ఆసుపత్రిలోని రికార్డుల ప్రకారం.. సోమవారం డెలివరీ కోసం 18 మంది గర్భిణీలు ప్రసూతి వార్డులో చేరారు. అందులో 8 మంది గర్భిణీలకు సిజేరియన్ చేశారు. ముగ్గురికి నార్మల్ డెలివరీ అయింది. మిగతా వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ వార్డుతో పాటు గర్భిణీల సమస్యల కోసం ఏర్పాటు చేసిన జనరల్ ఓపీ వార్డుకు పలువురు గర్భిణీలు వచ్చి వెళ్లారు. బాలింతల కోసం ఏర్పాటు చేసిన బాత్రూమ్ లో నాలా మూత తెరిచి, అందులో పసికందు మృతదేహాన్ని పడేసి మూతను తిరిగి గట్టిగా బిగించారు.


ఈ నేపథ్యంలో బాత్రూమ్ లో గుర్తించిన పనికందు ఎవరి బిడ్డ అనేది తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓపీకి వచ్చిన వారిలో ఎవరైనా బాత్రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చి, ఆపై నాలాలో పడేసి వెళ్లారా.. లేక పుట్టిన శిశువును వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నమా? అనేదానిపై ఆరా తీస్తున్నారు. కాగా, బాత్రూమ్ లో పసికందు మృతదేహం బయటపడడంతో ఆసుపత్రిలోని బాలింతలు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM