గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

byసూర్య | Tue, Jan 24, 2023, 07:36 PM

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గ్రూప్ 3, 4 నాలుగు పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, రాజేశం లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ ను జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 99 మంది అభ్యర్థులకు 90 రోజుల శిక్షణ అనంతరం ఈ మెటీరియల్ ను పంపిణీ చేయడం జరిగిందని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM