వంసత పంచమి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

byసూర్య | Tue, Jan 24, 2023, 05:24 PM

ప్రతి పండుగ...వేడుకలకు  ప్రత్యేక బస్సులు వేసే  టీఎస్ ఆర్టీసీ తాజాగా వసంత పంచమి సందర్భంగా తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి కూడా ఆ సౌకర్యం కల్పించింది. ఈనెల 26న పలు జిల్లాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం మెుత్తం 108 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. నిర్మల్‌ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ నుంచి 21 బస్సులు, జేబీఎస్‌ నుంచి 12, నిజామాబాద్‌ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్‌ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును నడపనున్నట్లు తెలిపారు.


మెదక్ జిల్లాలోని వర్గల్‌ సరస్వతీ ఆలయానికి సికింద్రాబాద్‌ గురుద్వారా నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్‌ గురుద్వారా నుంచి 10, జేబీఎస్‌ నుంచి 6, గజ్వేల్‌ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సర్వీసులు పెంచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సులకు సంబంధించి పూర్తి వివరాలు, అడ్వాన్స్ రిజర్వేషన్స్ కోసం సంస్థ అధికారిక వెబ్‌ సైట్‌ www.tsrtconline.in ను సందర్శించాలని ఆర్టీసీ అధికారులు భక్తులకు సూచించారు.



Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM