విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏబివిపి ఆధ్వర్యంలో మానవహారం

byసూర్య | Tue, Jan 24, 2023, 02:39 PM

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ విడుదల చేయాలని, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, యూనివర్సిటీలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం మెదక్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మెదక్ నగర కార్యదర్శి భాను ప్రసాద్ మాట్లాడుతూ. కెసిఆర్ అధికారం చేపట్టి తొమ్మిది ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న విద్యారంగ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.


రాష్ట్రంలో ఇప్పటివరకు 2200 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంటే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక అనేక మంది పేద విద్యార్థులకు చదువులకు దూరం అవుతున్నారన్నారు. ఉన్నత విద్యకు కేంద్రాలైన యూనివర్సిటీలలో టీచింగ్ పోస్టులు భర్తీ కాక, తరగతులు జరగక అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎంఈఓ, డీఈఓ పోస్టులు భర్తీ చేయక చాలా సంవత్సరాలు అవుతుందని, దీంతో క్షేత్రస్థాయిలో పాఠశాలలను పర్యవేక్షించక విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారని అన్నారు.


రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు పక్క భవనాలు, సరిపడ ఫ్యాకల్టీ లేక అనేక ఇబ్బందులకు గురవుతూ రాష్ట్రంలో ఉన్నత విద్య సంక్షోభంలో ఉందని, ఇంటర్మీడియట్ కళాశాలలకు సరైన సమయంలో అఫిలియేషన్ ఇవ్వక 80, 000 మంది విద్యార్థుల జీవితం ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. అన్ని విద్యారంగ సమస్యలు ఉన్నప్పటికీ కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ లో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి భానుప్రసాద్, కార్యకర్తలు, ఉదయ్, రంజిత్, రవితేజ, లోహిత్, విష్ణు, మనోజ్, ఆర్తి, విజయలక్ష్మి, సుదీక్ష పటేల్, శివలక్ష్మి, అనిల్, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM